గబ్బర్ సింగ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కలెక్షన్ రికార్డులను బద్ధలుకొట్టిన గబ్బర్ సింగ్ శతదినోత్సవ వేడుక హైదరాబాదులోని ముషీరాబాద్‌లో షషీష్ ఫంక్షన్ హాలులో శనివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాన్ని చిరు, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూర్ అహ్మద్ నిర్వహించారు. 100 రోజుల వేడుక సందర్భంగా మెగా అభిమానులు రక్తదానం చేశారు. 150 మంది అభిమానులు రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు.
ఈ వేడుకకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హాజరయ్యారు. మెగా ఫ్యామిలీపై ఎల్లప్పుడూ ఇదే అభిమానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
Post a Comment