ప్రతివారికీ ముద్దుపేర్లు ఉండటం సహజమే. సినిమా హీరోలకు ఉంటాయి. బాబు, బుజ్జి, బంటి, కన్నా, చిన్నా అంటూ రకరకాలుగా ఇంట్లో పిలుచుకుంటారు. రామ్ చరణ్‌ని ఇంట్లోవాళ్లు చెర్రీ అంటారు. ఆయన్ని స్నేహితులు కూడా అలానే పిలుస్తారు. అదే పేరుతో సినిమా రాబోతుంది.
వి.వి. వినాయక్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కాజల్ జోడీగా నటిస్తోంది. అమలాపాల్ మరోనాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో సన్నివేశాలు చిత్రించారు. ఈ సినిమాకు చెర్రీ అనే పేరు పరిశీలనలో ఉంది.
రామ్ చరణ్ అభిమానులు ఎలాగూ చెర్రీ అనిపిలుస్తుంటారు కనుక ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారట. ఇదే పేరుతో తను వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేశాడు. అందులో రామ్‌చరణ్ విషయాలుంటాయి. గతంలో అల్లుఅర్జున్‌తో అర్జున్ ముద్దుపేరైన 'బన్నీ' పేరుతో చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించాడు.
Post a Comment