ఒకప్పుడు దర్శకుడు తాను రిక్షా తొక్కే అబ్బాయిని కూడా హీరో చేస్తాను. సామాన్యుడి సైతం వెండితెరపై వెలిగిస్తానంటూ... ప్రకటనలు ఇచ్చి యూత్‌ను బాగా ఆకట్టుకుని చిత్రాలు తీశాడు. కానీ వాస్తవం మాత్రం విరుద్ధంగా ఉండేది. ఇప్పుడు రాజమౌళి విషయంలో ఎవరిని పెట్టైనా సినిమా తీయగలనని నిరూపించుకున్నాడు. ఇప్పటికి 9 చిత్రాలు చేశాడు. ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరుపొందారు.
ఈగ రిలీజ్‌కు ముందురోజు రాత్రి రాజమౌళి కొంతమంది సన్నిహితులు ప్రివ్యూను చూశారు. అప్పటికే హిట్‌టాక్ వచ్చింది. దీంతో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా చెప్పుకునే దాసరి గర్వించాడు కూడా. తెలుగు ఇండస్ట్రీ స్టామినాను దేశాలకు వ్యాపింప చేసిన దర్శకుడిగా అభినందించారు.
అయితే రాజమౌళితో సినిమాలు చేసే హీరోలకు మైనస్ అవుతుందనే అపప్రద ఉంది. అందుకు తగినట్లే కొన్ని చిత్రాలు ఉదాహరణగా చెప్పుకొనేవారు. హీరోను తన చిత్రంతో ఎక్కడికో తీసుకెళతాడు. ఆ తర్వాత చిత్రంలో హీరో ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో ఉండేవారు. అలాంటి ఇబ్బందిని ఎన్.టి.ఆర్. ఫేస్ చేశాడు. సునీల్ కూడా అంతే. కానీ మగధీర విషయంలో రామ్‌చరణ్ వల్లే సినిమా ఆడిందని అతని ఫ్యాన్స్ గొప్పగా చెప్పేవారు. తను కూడా అలాగే ఫీలయ్యాడు.
అలాంటిది ఇప్పుడు నేను ఈగను కూడా హీరోగా చేసి చూపించానని సమాధానమిచ్చాడని ఫిలింనగర్‌లో కొంతమంది జీవులు చెప్పుకుంటున్నారు. శనివారంనాడు పలు సినిమా ఆఫీసుల్లో ఈ విషయమై చర్చ జరుగుతోంది. రాజమౌళి గురించి తెగ చెప్పుకుంటున్నారు. గతంలో రాజకీయనాయకులు తన ప్రాబల్యం ఉన్న ఏరియాల్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అంటుండేవారు. ఇప్పుడు రాజమౌళి కూగా రేపు కుక్కను కూడా హీరోగా చూపించే సత్తా ఉన్నవాడంటూ చెబుతున్నారు.
ఐతే ఈ చర్చ విన్నవాళ్లు కొందరు మాత్రం అవతలికి వెళ్లి పగలబడి నవ్వుకుంటున్నారు. గతంలో పొట్టేలు పున్నమ్మలో పొట్టేలు ప్రధాపాత్రలో కనిపిస్తుంది.. అదేవిధంగా మనవూరి మారుతిలో కోతి, నోములో పాముదే ప్రధాన పాత్ర.. ఇలా చెప్పుకుంటూపోతే గతంలోనూ అనేక చిత్రాలు జంతువులపై తీసిన చరిత్ర తెలుగు పరిశ్రమకు ఉన్నదనీ, అయితే అందివచ్చిన టెక్నాలజీని రాజమౌళి ఉయోగించుకుని సఫలమవుతున్నాడని అంటున్నారు. ఎవరి వాదన వాళ్లది. చూద్దాం.. రాజమౌళి కుక్కను పెట్టి హీరోగా చిత్రం చేస్తారేమో..?!!

Share with Friends : |
Share with Friends : |
Post a Comment