అల్లరి నరేష్... ఇవివి సత్యనారాయణ వారసుడిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనుకోకుండా నటుడయ్యాడు. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసి అల్లరి నరేష్‌గా పిల్చుకునే నరేష్ కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ వారసుడిగానూ పేరు తెచ్చుకోవాలనే తన తండ్రి ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. తనకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్ అనే చెబుతుంటాడు.
హాస్య పాత్రలతోపాటు సెంటిమెంట్ పాత్రలను పోషించిన తను తాజాగా యాక్షన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 3డి వెర్షన్‌లో రూపొందే ఈ చిత్రంలో మరో ముగ్గురు కథానాయకులు నటించడం విశేషం. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేష్‌తో మాటామంతీ.
3డి సినిమా చేస్తున్నారు. పైగా నిర్మాత దర్శకుడిగా మారడం ఎలా అనిపించింది?
తెలుగులో వస్తున్న 3డి సినిమాల్లో ప్రత్యేకమైన చిత్రమిది. తెలుగు, తమిళ నటులు కలిసి నటిస్తున్నారు. వైభవ్, రాజు సుందరం, శ్యామ్‌లతో కలిసి నేను నటిస్తున్నాను. సాంకేతికంగా హై వాల్యూస్‌తో కూడిన చిత్రమిది. నిర్మాత అనిల్ సుంకర్‌కు దర్శకునిగా కొంత అనుభవముంది. ఈ చిత్రాన్ని ఆయన తన టీమ్‌తో బాగా తెరకెక్కిస్తున్నారు.
కామెడీ హీరోగా కాకుండా నటనకు అవకాశమున్న చిత్రాల్లో నటిస్తున్నారా?
నేను చేసిన 'గమ్యం' చిత్రంలో గాలి శీను పాత్ర ఎంతగానో పేరు తెచ్చింది. చిల్లర దొంగ పాత్ర అయినా వినోదాత్మకంగా తెరకెక్కించారు. మంచి భావోద్వేగాలున్నాయి. ఇది చూశాక తమిళ దర్శకుడు 'శంభో శివ శంభో'లో నటనకు హోప్స్ ఉన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఒక్కసారిగా చెవిటిపాత్రగా మారడంతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా సానుభూతి వచ్చేసింది. దానికి కామెడీ కోటింగ్ ఇవ్వడంతో పాత్రకు న్యాయం జరిగింది. ఇప్పుడు యాక్షన్‌లో కూడా నటనకు అవకాశమున్న పాత్రే చేశాను.
తెలుగు కంటే తమిళంలో మీకు మంచి పాత్రలు వస్తున్నాయనే కామెంట్ ఉంది?
మన తెలుగులోనూ మంచి పాత్రలు పోషించాను. ఇక్కడ కథలు కూడా బాగానే ఉన్నాయి. తమిళంలో నేటివిటికీ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివి మన దగ్గర పెద్దగా నచ్చవు. 'పొరాళి' అనే చిత్రంలో పాత్ర చేశాను. అక్కడ పెద్ద రెస్సాన్స్ వచ్చింది. దాంతో నరేష్‌తో ఇలా కూడా చేయించుకోవచ్చని చాలామంది భావిస్తున్నారు. మరో తమిళ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయి.
హాస్య పాత్రల్లో డైలాగ్స్‌లోనూ, కథలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
హాస్య ప్రధానమైన క్యారెక్టర్లు చేయడం, వాటి హావభావాలు పలికిస్తూ మెప్పించడం కత్తిమీదసామే. దానికి తగినట్లు డైలాగ్స్ ఉండాలి. ఏమాత్రం బోర్డర్ దాటినా పాత్రకే మోసం వస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటే కుటుంబ ప్రేక్షకుల్లో చాలామంది దూరమయ్యే అవకాశముంది. అందుకే సంభాషణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇందుకు రచయితలు కూడా సహకరిస్తారు.
స్వంత నిర్మాణ చిత్రాలు ఎప్పుడు చేయనున్నారు?
ప్రస్తుతం బయటి చిత్రాల్లోనే బిజీగా ఉన్నాను. స్వంత బేనర్‌లో నటించే అవకాశం త్వరలోనేఉంది.
మీ తదుపరి చిత్రాలు?
నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం అక్టోబర్‌లో మొదలుకానుంది. అమ్మిరాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేవీప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాను. ఆ తర్వాత జి.రామప్రసాద్, అంబికా కృష్ణ నిర్మించే చిత్రాలు ఉన్నాయి అని చెప్పారు నరేష్

Share with Friends : |
Share with Friends : |
Post a Comment