‘‘నేను కోటిన్నర దాకా తీసుకుంటున్నానని కొందరు మీడియాలో రాస్తున్నారు. నేను అంత రెమ్యునేషన్ తీసుకుంటున్నానని వాళ్లు నిరూపిస్తే.. ఆ కోటిన్నర వాళ్లకే ఇచ్చేస్తా. నిర్మాతలను ఇబ్బంది పెట్టే పని నేనెప్పుడూ చేయను'' అంటూ ఛాలెంజ్ విసిరింది కాజల్. అలాగే రీసెంట్ గా ఓ ప్రముఖ తమిళ పత్రిక చేసిన సర్వేలో కాజల్ నెంబర్ వన్ అనీ,రెమ్యునేషన్ లో టాప్ అని తేల్చింది.
దానిపై ఆమె స్పందిస్తూ...'ఇలాంటి సర్వేలను నేను నమ్మను. ఆ సర్వే నిర్వహించిన వారు దాదాపు నా అభిమానులనే అడిగివుంటారు. అందుకే ఫలితాలు అలా వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ సర్వే నిర్వహించమనండి. ఫలితం ఇంకోలా వస్తుంది. అనుష్క, నయనతార, తమన్నా, సమంతల స్టార్‌డమ్ కూడా నాకు తెలిసి తక్కువైందేం కాదు. ఏది ఏమైనా నాకు మార్కులేసిన అభిమానులకు మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను' అంది.
ప్రస్తుతం ఆమె దృష్టి అంతా సూర్యతో చేస్తున్న ‘మాట్రాన్' పై ఉంది. ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్' అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ విషమయై ఆమె మాట్లాడుతూ...‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నింటిలో భిన్నమైన సినిమా ‘మాట్రాన్'. ఇందులో నేను రొటీన్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపించను. కొత్తగా కనిపిస్తా'' అంది కాజల్ అగర్వాల్.

'అలాగే సూర్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఓ పాత్ర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక రెండో పాత్ర చేసే అల్లరైతే అంతా ఇంతా కాదు. ఆ రెండు పాత్రల్లో ఆయన నటన చూస్తే నాకెంతో ముచ్చటేసింది. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా. సూర్యతో పాటు నాకూ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది' అంది. సూర్య హీరోగా, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘మాట్రాన్' ఆగస్ట్ 15న విడుదల కానుంది.ఇక ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ లోనూ, కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్‌లతో ఈ ఉత్తరాది భామ ఒక్కో సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఆమె ఆచి తూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment