తమిళ దర్శకుడు శంకర్ సినిమా అంటే....అన్నీ భారీగానే ఉంటాయి. కథ దగ్గర నుంచి సాంకేతిక విలువలు, బడ్జెట్ వరకు సినిమాకు తగిన విధంగా ఎవరెస్ట్ రేంజికి తీసుకెళ్లి ప్రేక్షకులు సూపర్ అనేలా సినిమాను రూపొందిస్తారు. అందుకే ఆయన ఇండియాలోనే టాప్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారాడు. జెంటిల్మెన్ అయినా, భారతీయుడు అయినా, అపరిచితుడు అయినా....నిన్నమొన్న వచ్చిన రోబో అయినా ఆయన డైరెక్షన్ రేంజే వేరు.
శంకర్ త్వరలో ‘ఐ' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 70 కోట్లతో ప్లాన్ చేస్తున్నారని చెన్నయ్ సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో విక్రమ్ కథానాయకుడు కాగా, సమంత హీరోయిన్‌గా సెక్టర్ అయింది.
ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా శంకర్ ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగిన విధంగా ప్రేక్షకులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఇందులో ఎఫెక్ట్స్ వచ్చేలా శంకర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టాప్ పొజిషన్లో ఉన్న సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. అందుకే ఈచిత్రానికి భారీ బడ్జెట్ అవసరమనే వాదన వినిపిస్తోంది.
ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటో గ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇది ఆయన శంకర్‌తో పనిచేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది. ‘మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఇంతమంది పేరుగాంచిన టెక్నీషియన్స్ ఉన్నారంటే సినిమాను ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తెలుగులోనూ ‘ఐ' పేరుతోనే విడుదలచేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment