ఒరిజినల్ వెర్షన్ ‘దబాంగ్' చిత్రం కంటే తాను తీసిన ‘గబ్బర్ సింగ్' చిత్రమే పెద్దది, పవన్ కళ్యాణే గొప్ప అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్. పవర్ స్టార్‌కు వీరాభిమాని అయిన హరీష్.... తన మనసులోని అభిమానాన్ని ఈ విధంగా బయట పెట్టారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
షూటింగ్ మొదలైన మొదటి రెండు రోజులు మొదటి టేక్ లోనే సన్నివేశాలను నేను ఒకే చేస్తుండటంతో... పవన్ కళ్యాణ్ ఒకసారి చూసుకోమని హరీస్ శంకర్‌కు చెప్పాడట. ఆ తరువాత అభిమానం అనే మత్తు నుంచి బయటకు వచ్చి దర్శకుడిగా చిత్రానికి పని చెయ్యడం మొదలుపెట్టాడట.
తన తదపరి చిత్రాలు గురించి హరీష్ శంకర్ చెపుతూ..జూనియర్ ఎన్టీఆర్‌తో వుంటుంది. కొడాలి నాని నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను. అలాగే ప్రయోగాత్మక సినిమాలంటే నాకు చాలా ఇష్టం. పారలల్ సినిమాలంటే చాలా మందికి భిన్న అభిప్రాయం వుంది. హృషికేశ్ ముఖర్జీ సినిమాల్ని నేను బాగా ఇష్టపడతాను. హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో, జీవితాల్లోని సంఘర్షణను ప్రతిబింబిస్తూ సినిమాలు చేయాలనే ఆలోచన వుంది. అందుకోసం పూర్తిస్థాయిలో మూడు స్క్రిప్ట్‌లు రాసుకున్నాను. దిల్‌రాజ్ బ్యానర్‌లో ఈ సినిమాలు చేసే అవకాశం వుంది అన్నారు.
ఎన్టీఆర్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి 'ఎంఎల్.ఏ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి(ఎం) లక్షణాలు(ఎల్)ఎ(అబ్బాయి) అని దర్శకుడి భావమట. అలాగే పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని వినికిడి. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment