మిల్కీ బ్యూటీ అని తమన్నాను పిలుచుకున్నట్లే కొంతమంది ఇండస్ట్రీలో హన్సికను యాపిల్‌పండు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈభామను తెలుగు ఇండస్ట్రీ కంటే పొరుగు రాష్ట్రంవారు నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతుంది.
రీసెంట్‌గా ఆమె నటించిన తమిళ చిత్రం 'ఓకే ఓకె' పెద్దవిజయాన్ని సాధించింది. దాన్ని కన్నడలో కూడా తీస్తే అక్కడా హిట్టే. దీంతో ఈ హాట్ బ్యూటీకి డిమాండ్ పెరిగింది. రీసెంట్‌గా తను తీసుకునే రెమ్యునరేషన్ కోటి చెబుతుందని తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలో కూడా తీసేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
బెల్లంకొండ వంటి కొంతమంది వ్యక్తులు పేర్లు వినిపించినా.. ఎవరు తీసుకున్నా తెలుగులోనూ హిట్ అవుతుందనే నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య గ్యాప్ వచ్చిన హన్సిక ఆ చిత్రాన్ని తెలుగులో చేస్తేమటుకు అది కూడా హిట్ ఖాతాలో జమ చేసుకుంటుందట. చూద్దాం ఏం జరుగుతుందో.
Post a Comment