.
Home » » జులాయి 13న వస్తున్నాడోచ్‌

జులాయి 13న వస్తున్నాడోచ్‌

Written By Hot nd spicy on Thursday, 21 June 2012 | 09:09

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం జులాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌పై డివివి దానయ్య సమర్పణలో తెరకెక్కింది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈసందర్భంగా ప్లాటినండిస్క్‌ ఫంక్షన్‌ జులై 8న గ్రాండ్‌గా చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇలియానా ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.

ఇలియానా మాట్లాడుతూ "ఇందులో నా పాత్రకు చాలామంచి పేరొస్తుంది. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలో కన్పించలేదు. ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్టయ్యాయి. సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, జులాయి ఆడియో సూపర్‌హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. దేవీశ్రీప్రసాద్‌ మంచి పాటలందించారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కూడా చాలా బాగుంటుంది. ఈ ఆడియో సక్సెస్‌ సందర్భంగా జులై 8న ప్లాటినం వేడుక చేస్తున్నాం. రాజేంద్రప్రసాద్‌ పాత్ర సినిమాలో కీలకం. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా 13న విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు.

చిత్ర సమర్పకుడు దానయ్య మాట్లాడుతూ- త్రివిక్రమ్‌ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను విభిన్నంగా చూపిస్తున్నారు. ఆయన పంచ్‌ డైలాగ్స్‌ సినిమాకు హైలైట్‌ కానున్నాయి. పాటలకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దేవీశ్రీ పాటలకు ప్రాణం పోశారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పారు.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger