మహేష్ బాబుతో కథ ఓకే చేయించుకోవాలని తమిళ దర్శకుడు లింగు సామి చాలా కాలంగా ట్రైల్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు డైరక్టర్స్ కి ప్రయారిటీ ఇచ్చినట్లుగా ఇతర భాషా దర్శకులను పెద్దగా పట్టించుకోని మహేష్ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇక మహేష్ కి ఎన్ని కథలు చెప్పినా ఓకే చేయటం లేదని అర్దం చేసుకున్న లింగు సామి..మెగా క్యాంప్ కి చేరుకుని రామ్ చరణ్ ని కలిసి కధ చెప్పి ఒఫ్పించాడని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ,తెలుగులలో తన చిత్రాలు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో వెంటనే ఈ ప్రాజెక్టుని ఓకే చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇక లింగు స్వామి ఇప్పటివరకూ అన్నీ తమిళ చిత్రాలే చేసినా తెలుగు నాట సైతం అతనికి అభిమానలు ఉండటం విశేషం. అతను డైరక్ట్ చేసిన రన్,పందెం కోడి చిత్రాలు ఇక్కడ పెద్ద హిట్టులుగా నమోదు చేసాయి. మొన్నామధ్యన కార్తీతో చేసిన ఆవారా చిత్రం సైతం తమిళం కన్నా ఇక్కడే బాగా ఆడింది. రేసీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేయటంలో చేయితిరిగిన లింగు స్వామి ...మహేష్ కోసం ఓ స్టైలిష్ ఎంటర్టైర్ చేసాడని,యాక్షన్ తో కలిపిన ఆ కథని ఇప్పుడు రామ్ చరణ్ కి తగ్గట్లు మార్పులు చేస్తున్నాడని చెప్తున్నారు. చరణ్ సైతం కొన్ని సూచనలు చెప్పాడని,ఓకే అనుకున్న తర్వాత చిరంజీవి కి కథ ఓకే అనిపించుకుని ప్రకటన ఇస్తారని చెప్పుకుంటున్నారు.
ఇక లింగు స్వామి ఇటీవల తమిళంలో రూపొందించిన హిట్ మూవీ ‘వెట్టై’ చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే మహేష్ బాబు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ చిత్రాన్ని ‘భలే తమ్ముడు’ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ‘వెట్టై’ తెలుగులో ‘భలే తమ్ముడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మాధవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్య మాధవన్ తమ్ముడి పాత్రలో నటించాడు. సమీరారెడ్డి, అమలపాల్ అక్క చెల్లుల్లుగా నటించారు.
ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ఎవడు,వివి వినాయిక్ పేరు పెట్టని చిత్రం,జంజీర్ రీమేక్ లు అయ్యాక ఈ చిత్రం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఈ లోగా లింగు స్వామి సైతం తమిళంలో ఓ చిత్రం చేసుకుని వద్దామా లేక వెయిట్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే స్క్రిప్టు పూర్తిగా ఉన్నాకే షూటింగ్ లో కి దిగుతామని రామ్ చరణ్ ఖచ్చితంగా చెప్పాడని వినికిడి. బంగారం దర్శకుడుతో రచ్చ కు ముందు మెరుపు చిత్రం ప్రారంభించి ఆపివేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు.

Post a Comment