"నయన మాయ" నుంచి బయటపడిన ప్రభుదేవా.!!
గ్లామర్ హీరోయిన్ నయనతార- కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరక్టర్ ప్రభుదేవాల ప్రేమాయణం అటకెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణంకు బ్రేక్ పడిన నేపథ్యంలో.. నయన మాయలో తేలియాడిన ప్రభుదేవా మెల్ల మెల్లగా బయటపడుతున్నాడని సినీ వర్గాల్లో టాక్. నయన ప్రేమాయణంతో ప్రభుదేవా వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయాడు. తన భార్య రామ్‌లతకు విడాకులు, పిల్లలు రిషి రాఘవేంద్ర, ఆదిల విషయంలో సైకలాజికల్ టార్చెర్ ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పూర్తిగా నయన మాయ నుంచి బయటపడిన ప్రభుదేవా.. ఓ ఇంటర్వ్యూలో ఓ తండ్రిగా బాధ్యతగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. తన కుమారులిద్దరితో ఎక్కువ సేపు గడుపుతున్నానని తెలిపాడు. కాగా ప్రస్తుతం రిషి, ఆది అనే ప్రభుదేవా కుమారులు ప్రస్తుతం అతనితోనే ఉంటున్నారు. రౌడీ రథోర్ సినిమా షూటింగ్‌లో కూడా ప్రభుదేవాతోనే ఇద్దరు కుమారులు ముంబైలో ఉంటున్నారు.ఇంకేముంది.. నయన మాయ నుంచి బయటపడిన ప్రభుదేవా తన కుటుంబంతో తిరిగి చేరే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. ఇదే విధంగా నయనతార కూడా గతాన్ని మరిచి కొత్త సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉందట.
Post a Comment