Home »
Gossips
» తండ్రీ కొడుకులతో నటించే ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్!
తండ్రీ కొడుకులతో నటించే ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్!
అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఓ మెరుపు మెరిసిన అందాల తారలు శ్రీదేవి, రాధలు తండ్రీ కొడుకులతో నటించే ఛాన్సులు కొట్టేశారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడు నాగార్జునతో కూడా శ్రీదేవి, రాధలు ఎన్నో చిత్రాల్లో నటించారు. శ్రీదేవి ఏఎన్నార్‌తో ప్రేమాభిషేకం చిత్రంలో నటించగా.. నాగార్జునతో ఆఖరి పోరాటం వంటి చిత్రాల్లో నటించింది. ఇక రాధ సంగతి కొస్తే ఎఎన్నార్‌తో ఆదర్శ కుటుంబంలో నటించింది. అలాగే నాగార్జునతో విక్కీ దాదాలో కూడా జతకట్టింది. తాజాగా మగధీర ఫేమ్ కాజల్ అగర్వాల్ తండ్రీకొడుకులతో నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజా లవర్ బాయ్ నాగచైతన్యతో దడ చిత్రంలో అందాలను ఆరబోసిన కాజల్ అగర్వాల్ కింగ్ నాగార్జునతో కొత్త చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేసిందని సమాచారం. ఈ సినిమాకు పూలరంగడు ఫేమ్ వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి "భాయ్" అనే టైటిల్‌ను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంకా త్వరలో ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు రానుందని సినీ వర్గాల్లో టాక్.
Post a Comment