రామ్ చరణ్ త్వరలో ఎవరెస్ట్ శిఖరం బ్యాక్ డ్రాప్ లో సాహసాలతో కూడిన ఓ డిఫెరెంట్ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు చిన్ని కృష్ణ కథను రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో గంగోత్రి,బద్రీనాధ్ చిత్రాలు హిమాలయాలు బ్యాక్ డ్రాప్ లో చేసిన చిన్ని కృష్ణ ఈ కొత్త కథను చాలా ఢిఫెరెంట్ గా తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరు...ఏ ప్రొడక్షన్ వంటి వివరాలు ఇంక వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఈ కథ కోసం చిన్ని కృష్ణ ఆ లొకేషన్స్ వెళ్లి మరీ వచ్చారు. అక్కడ లొకేషన్స్ ని చూసి కథలో ఇమిడ్చినట్లు,సాహసాలతో కూడిన యాక్షన్ చిత్రంగ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్లు వినికిడి.
ప్రస్తుతం రామ్ చరణ్ తేజ ఎవడు షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగి ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ...గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడు. అందుకే పెద్దవాళ్లన్నారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ ఉంటాడని. అలాంటివాడే రామ్‌చరణ్...ఆ పాత్రను ఎవడు చిత్రంలో చూడాలి అంటున్నారు.
ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది. ఇక ఈ చిత్రంతో పాటు వినాయిక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ రామ్ చరణ్ చేస్తున్నారు. హిందీ జంజీల్ లో మొన్నీ మధ్యనే షూటింగ్ లో పాల్గొని వచ్చాడు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment