సూపర్ స్టార్ మహేష్ బాబు మూడ నమ్మకాలు(సెంటిమెంటు) బాగా నమ్ముతాడా? గతంలో ఏ విషయంలోనైనా మంచి జరిగితే..మాక్సిగమమ్ ఆ రూట్‌లోనే ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడా? అంటే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తను నటించిన హిట్ సినిమాలకు సంబంధించి ఏదైనా బలమైన పాయింట్ ఉంటే దాన్ని తన తర్వాతి సినిమాల్లో కూడా రిపీట్ చేయడానికి దర్శకులపై ఒత్తిడి తెస్తాడని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా రూపొందుతోంది. వెంకీ సరసన అంజలి నటిస్తుండగా, మహేష్ సరసన సమంత రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం భాగంగా మహేష్ బాబు, సమంత మధ్య పెళ్లి సీన్ చిత్రీకరిస్తున్నారు.
అయితే వాస్తవానికి ఈ చిత్రంలో తొలు పెళ్లి సీన్ లేదని, మహేష్ బాబు ఒత్తిడి మేరకు ఈ సీన్ పెట్టారని అంటున్నారు. మహేష్ బాబు గతంలో నటించిన మురారి, ఒక్కడు, అతడు, దూకుడు చిత్రాల్లో పెళ్లి సీన్ ఉంది. పెళ్లి సీన్ తన సినిమాలకు బాగా ప్లస్సయిందని మహేష్ బాబుకు నమ్మకమట. అందుకే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా ఆసీన్ రిపీట్ చేశారని అంటున్నారు. గత సినిమాల్లో మాదిరి మహేష్ బాబు నమ్మకం ఈ చిత్రం విషయంలోనూ ఫలిస్తుందో..? లేదో..? చూడాలి.
Post a Comment