తమిళ స్టార్ హీరో అజిత్, పంజా దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో వస్తున్న తమిళ చిత్రం ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశం అవుతోంది. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే నయనతార, ఆర్య, తాప్సి లీడ్ రోల్స్‌లో ఎంపికయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మన తెలుగు స్టార్స్ నాగార్జున, రవితేజలు కూడా దర్శనం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈచిత్రంలో ‘రోజా’ ఫేం అరవింద స్వామి ఓ ముఖ్య పాత్రలో ఖరారు కాగా...విష్ణువర్ధన్ టీం తాజాగా నాగార్జున, రవితేజ, జగపతిబాబులను అతిథి పాత్రల కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
శ్రీ సత్యసాయి మూవీస్ బేనర్‌పై ఎఎం రత్నం ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా...పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా శ్రీకార్ ప్రసాద్, మాటల రచయితగా సుభా, ఆర్ట్ డైరెక్టర్‌గా సునీల్ బాబు, కాస్టూమ్ డిజైనర్‌గా అనువర్ధన్ పని చేయనున్నారు. మే 31న ముంబైలో ఈచిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
Post a Comment