పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ,కలెక్షన్స్ సునామీలు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని చూసారు. చెన్నైలో ఆయన తన కుటుంబ సబ్యులతో కలిసి ఈ చిత్రాన్ని చూసారు. అంతేగాక ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ ని రిపీట్ చేసి మరీ ఎంజాయ్ చేసారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి ఎపిసోడ్ ..వన్స్ మోర్ అన్నారని చెప్తున్నారు.
ఈ స్క్రీనింగ్ అనంతరం ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ...తాను గబ్బర్ సింగ్ చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేసానని అన్నారు. అంతేగాక ఫెరఫెక్ట్ మాస్ ఎంటర్టనర్ గా గబ్బర్ సింగ్ ని ఆయన అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ఫెరఫార్మెన్స్ ని ఆయన మెచ్చుకున్నారు. పవన్ కి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. దర్శకుడుని కూడా ఆయన మెచ్చుకున్నారు.
ఇక రజనీకాంత్ ప్రస్తుతం ...తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ‘కోచడయాన్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి ‘విక్రమసింహా’ అనే పేరును ఖరారు చేశారు. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రజనీకాంత్ చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్ టెక్నాలజీతో షాట్స్ తీయడం ఒక సవాల్ ... ఇదొక టఫ్ జాబ్ అన్నారు. అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్' ఒక విందులాంటిదని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment