జాహ్నవిని నటిగా కాదు.. గృహిణిగా చూడాలనుకుంటున్నా... శ్రీదేవి..?!!
శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినిమాల్లోకి వచ్చేస్తుందంటూ గత కొన్నిరోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా జాహ్నవి హీరోయిన్‌గా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ప్రణాళికలు రెడీ అవుతున్నాయంటూ మీడియా చాలా గోల చేసింది. అయితే వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ శ్రీదేవి తన కుమార్తెల గురించి తాను ఏమనుకుంటున్నదో మనసువిప్పి చెప్పేసింది. చిన్న వయసులో తాను తెరంగేట్రం చేయడం వల్ల చదువును మిస్ అయ్యాననీ, అలాంటి పరిస్థితి తన కుమార్తెలకు రాకూడదని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కనుక పూర్తిగా వారి చదువుపైనే తాము శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించింది. తన కూతుళ్లను తారల్లా చూడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. చదువు ముగిశాక తమ కుమార్తెలకు సాధ్యమైనంత త్వరగా పెళ్లిల్లు చేస్తామని చెప్పింది. కనుక జాహ్నవి తెరంగేట్రం చేసే అవకాశం చాలాచాలా తక్కువన్నమాట.
Post a Comment