నాని, సమంత కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ఈగ చిత్రం అంతటా ఇప్పుడు హాట్. మొన్న శనివారం ఈ చిత్రం ఆడియో,ట్రైలర్స్ విడుదలైన దగ్గరనుంచి ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. అప్పటికీ రాజమౌళి ఈ చిత్రం కథని ఓపినింగ్ రోజునే రివిల్ చేసేసారు. అయితే అలా రివిల్ చేయటంతో అసలు అలాంటి కథను ఎలా తెరకెక్కిస్తారనే అంచనాలు సైతం పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో అసలైన ట్విస్టు అంటూ ఓ మెలిక బయటకు వచ్చింది.
రాజమౌళి చెప్పే ‘ఈగ’సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ లో ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం. ఇక్కడ ఈగ ఎంత కాలం బ్రతుకుతుందనే విషయమై టైం లాక్ పెట్టారని తెలుస్తోంది.
హీరో ఈగ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈగ జీవిత కాలం పరిగణనలోకి వస్తుంది. ఈగ జీవిత కాలం 17 రోజులు మాత్రమే..కాబట్టి ఈ లోగా విలన్ ని చంపేయ్యాలి అనేది టైం లాక్. లేకపోతే ఈగ మరణిస్తుంది. అతి తక్కువ జీవిత కాలం ఈగ కూ ఉంటడంతో కథలో టెన్షన్ ఎలిమెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈగ ..అతి త్వరగా తను పగ పట్టిన విలన్ సుదీప్ పై ఎలా పగ తీర్చుకుందనేది రసవత్తరంగా ఉండబోతుందని అంటున్నారు.ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించారు.నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు.అది బైలిగ్వల్.ఇక కన్నడ,హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా వస్తున్నాయని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టారని విశ్వసనీయ సమాచారం. మొత్తం బడ్జెట్ ముప్పై రెండు కోట్ల వరకూ అయిందని చెప్తున్నారు.తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి సెంధిల్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment