‘జంజీర్’ రీమేక్ మమ్మల్ని అడక్కుండా ఎలా చేస్తారు అంటూ ఆ మధ్యన రచయితలు జావేద్ అక్తర్, సలీమ్‌ఖాన్ మండిపడిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ చరణ్ కి ఆదిలోనే హంసపాదులా..బాలీవుడ్ ఎంట్రీకి ఈ రాంగ్ సిగ్నల్స్ ఏంటిరా అనిపించింది. దర్శక,నిర్మాతలు అయితే ఎక్కడ ఈ రచయితలు తమను కోర్టుకు ఈడుస్తారో అని భయపడుతున్నారు. అయితే సలీమ్ ఖాన్ కుమారుడు సల్మాన్ ఖాన్ వాటిని కొట్టిపారేస్తున్నారు. నిరభ్యంతరంగా ఈ సినిమాను చేసుకోవచ్చని మీడియాతో అన్నారు.
ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ...నేనైతే వందకు వందశాతం జంజీర్ రీమేక్ చేసుకోవచ్చనే అంటాను. అది పెద్ద సూపర్ హిట్ సినిమా అన్నారు. మరి మీ నాన్నగారు అభ్యంతరపెడుతున్నారు కదా అంటే...షారూఖ్ చేసిన డాన్ సినిమాకు మా నాన్నగారూ స్క్రిప్ట్ రైటరే. అయితే దానికి ఎక్కడా అభ్యంతరపెట్టలేదు. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది కదా అన్నారు. అయితే ఈ కామెంట్స్ తో ఆ రైటర్స్ ద్వయం ఏమంటారో చూడాలి అంటోంది బాలీవుడ్ మీడియా. ఎందుకంటే రేపు ఏమన్నా లీగల్ గా గొడవ అయితే సల్మాన్ ఏమి చెయ్యగలడు అంటోంది.
ఇక 1973లో విడుదలైన ‘జంజీర్’ ఓ ట్రెండ్‌సెట్టర్ అయ్యింది. అప్పటివరకు జోరుగా సాగుతున్న రొమాంటిక్ చిత్రాల స్థానంలో ‘జంజీర్’ రాకతో యాక్షన్ చిత్రాల హవా మొదలైంది. ఈ చిత్రవిజయానికి ప్రధాన కారణం సలీమ్, జావేద్ అందించిన కథ, మాటలు . అందులోనూ ఈ సినిమాలో ‘మేరీ పాస్ మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది) అనే డైలాగ్ ఉంది. ఇక నిర్మాత మర్యాద కోసమైనా తమ దగ్గర ఈ రీమేక్ విషయాన్ని ప్రస్తావిస్తే బాగుండేదని, ఏదేమైనా ఈ వ్యవహారాన్ని అంత సులువుగా వదిలేది లేదని పేర్కొన్నారాయన. ఒక రచయిత రాసిన కథను మళ్లీ తెరకెక్కించేటప్పుడు ఆ రైటర్ దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ రచయితలిద్దరూ స్పష్టం చేశారు.
అయితే జావేద్, సలీమ్ ఈ రీమేక్ విషయంలో బాధపడ్డారని తెలుసుకున్న నిర్మాత అమిత్‌మెహ్రా తన స్పందనను ఇలా తెలియజేశారు... సలీమ్ అంకుల్, జావేద్ అంకుల్ ఆశీర్వాదాలు తీసుకోకుండా నేను ‘జంజీర్’ ఆరంభించను. వాళ్లిద్దరూ నా కుటుంబ సభ్యుల్లాంటివారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ‘గార్డియన్స్’లా వ్యవహరించారు వారు. నాన్నగారు తీసిన చిత్రాలకు వారి సహకారం ఎంతో ఉంది. అలాంటివారిని నిర్లక్ష్యం చేయాలనుకోను. ప్రస్తుతం ‘జంజీర్’ చర్చల దశలోనే ఉంది. అన్నీ కుదిరిన తర్వాత ప్రత్యేకంగా సలీమ్ అంకుల్, జావేద్ అంకుల్‌ని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment