రామ్ చరణ్ తేజ తాజా చిత్రం రచ్చ ఏప్రియల్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలయ్యే థియేటర్స్ విషయంలో అంతటా చర్చ రచ్చ స్ధాయిలో జరుగుతోంది. మహేష్ చిత్రం బిజినెస్ మ్యాన్ 1000 థియేటర్స్ లో విడుదల చేసి మొదటిసారిగా రికార్డు క్రియేట్ చేయటంతో ఈ చిత్రం థియేటర్స్ సంఖ్య కూడా దాన్ని బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. మినిమం రెండు వేల థియేటర్స్ దాటే ఉంటుందని చెప్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యే థియేటర్స్ కాబట్టి మినిమం ఆ రేంజిలో ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. అందులోనూ తమిళ,మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కానుండటంతో థియేటర్స్ సంఖ్య భారీగా ఉంటాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్ అభిమానులే కాక, మిగతా హీరోల ప్యాన్స్ కూడా ఈ ధియోటర్స్ సంఖ్యపై రచ్చ,చర్చ జరుగుతోంది.
ఇక మరో ప్రక్క రచ్చ ట్రైలర్స్,పాటలతో ఇప్పటికే అంతటా క్రేజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ లో చూపించిన ఇక రేయ్ నువ్వు అరిస్తే అరుపులే...నేను అరిస్తే మెరుపులే..అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగులు అంతటా మారు మ్రోగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి టైప్ లో ఒక్కసారి లెప్ట్ టర్నింగ్ వేసుకో...కండ తక్కువ కటింగ్ ఎక్కువ అంటూ తమన్నా తో చెప్పే డైలాగు సూపర్బ్ అంటున్నారు. ఇక హిందీలో తమన్నా ని చూస్తూ..అప్ బాహర్ సే బహుత్ అచ్చా,హమ్ తేరే లియే ఇదర్ వచ్చా, చహమ్ దోనోంతో రచ్చ అంటూ చెప్పటం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది.
రచ్చ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ..గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవిలా కనిపిస్తారని చెప్తున్నారు. అలాగే పరుచూరి వారు సైతం డైలాగులు అదిరిపోయేలా రాసామని హామీ ఇస్తున్నారు. ఆరెంజ్ వంటి మెగా డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం మాస్ హీరోగా మళ్లీ రామ్ చరణ్ తేజ్ని ఓ స్టెప్ ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. మరో ప్రక్క మణిశర్మ అందించిన ట్యూన్స్ రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసాయి.
మెగాసూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్.బి. చౌదరి సమర్పకులు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నామన్నారు. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా ఉంటుందని, మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. వాన వాన రీమిక్స్ పాట సినిమాకు పత్ర్యేక ఆకర్షణ తెస్తుందని చెప్పుకొచ్చారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మెడికోగా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి

Share with Friends : |
Share with Friends : |
Post a Comment