రేయ్ నువ్వు అరిస్తే అరుపులే...నేను అరిస్తే మెరుపులే..అంటూ వదిలిన రామ్ చరణ్ రచ్చ ట్రైలర్ అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. నిన్న(ఆదివారం)రాత్రి జరిగిన ఆడియో పంక్షన్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు అభిమానులను ఉత్తేజపరుస్తోంది. అందులో కట్ చేసిన డైలాగులు ఫ్యాన్స్ నే కాక అందరినీ అలరిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి టైప్ లో ఒక్కసారి లెప్ట్ టర్నింగ్ వేసుకో...కండ తక్కువ కటింగ్ ఎక్కువ అంటూ తమన్నా తో చెప్పే డైలాగు సూపర్బ్ అంటున్నారు. ఇక హిందీలో తమన్నా ని చూస్తూ..అప్ బాహర్ సే బహుత్ అచ్చా,హమ్ తేరే లియే ఇదర్ వచ్చా, చహమ్ దోనోంతో రచ్చ అంటూ చెప్పటం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది.
ఇక రచ్చ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ..గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవిలా కనిపిస్తారని చెప్తున్నారు. అలాగే పరుచూరి వారు సైతం డైలాగులు అదిరిపోయేలా రాసామని హామీ ఇస్తున్నారు. ఆరెంజ్ వంటి మెగా డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం మాస్ హీరోగా మళ్లీ రామ్ చరణ్ తేజ్ని ఓ స్టెప్ ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. ఇక మణిశర్మ అందించిన ట్యూన్స్ రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసాయి.

Post a Comment