హీరోయిన్ త్రిష స్థానాన్ని...హాట్ బేబీ అనుష్క కొట్టేసింది. అయితే ఇదేదో సినిమాకు సంబంధించిన విషయం మాత్రం కాదు. ‘మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా?’ అంటూ హీరోయిన్ త్రిష కోల్గేట్ యాడ్‌లో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యాడ్ లో అనుష్క దర్శనం ఇవ్వబోతోంది. తెలుగు, తమిళం ప్రకటనల్లో ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. చాలా కాలంగా త్రిషను కొనసాగిస్తున్న కొల్టేట్ కంపెనీ తమ ప్రకటనలకు కొత్త ఆకర్షణ తేవడంలో భాగంగా హాట్ లేడీ అనుష్కతో కాంపెయిన్ చేయించాలని డిసైడ్ అయింది. మరో వైపు అల్లు అర్జున్‌ను కూడా ప్రచారంలో వాడుకుంటోంది.
సినిమాలతో పాటు ఇటు యాడ్ ఫిల్మ్ విషయంలోనూ అనుష్క తనకు పోటీ వస్తుండటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు త్రిషకు. దీంతో ఇతర బ్రాండ్ల ప్రచారం చేసే అవకాశం దక్కించుకోవడానికి తన మేనేజర్‌తో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.
అనుష్క ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో మూడు చిత్రాలు చేస్తూ త్రిషకు గట్టి పోటీ నిస్తోంది. నాగార్జున సరసన డమరుకం, ప్రభాస్ సరసన వారధి, తమిళంలో అలెక్స్ పాండ్యన్, తాండవం, ఇరందమ్ ఉలగం చిత్రాల్లో నటిస్తోంది. త్రిష చేతిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. తెలుగులో దమ్ము, తమిళంలో సమరన్, ఎండ్రెండ్రుమ్ పున్నగయ్ చిత్రాల్లో నటిస్తోంది.

Post a Comment