స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ డేట్స్ కోసం ట్రై చేసిన డేవిడ్ ధావన్ ప్రస్తుతం ఆమె డూప్ లాంటి జరీన్ ఖాన్ తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే హిందీ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం 'పార్ట్‌నర్'. సల్మాన్ ఖాన్, గోవిందా, కత్రినా కైఫ్, లారా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 'పార్ట్‌నర్-2' పేరుతో తెరకెక్కబోయే ఈ కొనసాగింపులో కత్రినా కైఫ్ స్థానంలో జరైన్ ఖాన్‌ను తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉండటమే ఆమె ఎంపికకు కారణమని చిత్రవర్గాలు తెలిపాయి.
సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో జరైన్ బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ప్రస్తుతం సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హౌస్‌ఫుల్-2'లో ఆమె నటిస్తోంది. భవిష్యత్తులో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనే ఎక్కువగా నటించేందుకు ఇష్టపడతానని ఆమె సెలవిస్తోంది. 'పార్ట్‌నర్-2' వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. కత్రినా కైఫ్ డేట్స్ దొరకని వాళ్లంతా ఇలా జరీన్ ఖాన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలోనూ ఐశ్వర్యా రాయ్ డూప్ గా వచ్చిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత అదే ఇమేజ్ తో కొంతకాలం కొనసాగిన సంగతి తెలిసిందే.

Post a Comment