హీరో రాణా దగ్గుబాటి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, సజయ్ దత్, రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అమితాబ్ గ్యాంగ్ స్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన పాత్రలో, సంజయ్ దత్, రాణా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో కనిపించనున్నాడు. వీరితో పాటు తెలుగు తారలు మధు శాలిని, మంచు లక్ష్మి కూడా నటిస్తున్నారు. మధు శాలిని లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో సిగరెట్లు, మందు సేవించే పాత్రలో, మంచు లక్ష్మి ప్రసన్న సంజయ్ దత్ భార్య పాత్రలో నటిస్తోంది. బ్రెజిల్ మోడల్ నతాలియా హాట్ ఐటం సాంగు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 18న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. అనంతరం పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలు కానుంది. కాగా, తన కొడుకు చిత్రాన్ని ఏపీలో మార్కెట్ చేసేందుకు నిర్మాత సురేష్ బాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లో భారీగా థియేటర్లను సమీకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment