ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగైదు కుటుంబాలవారే థియేటర్ల కబ్జా చేశారని చిన్న నిర్మాతలు గగ్గోలు పెడుతున్నట్లే.. ఈసారి వారి కుటుంబాల నుంచి వస్తున్న చిత్రాలతో సమ్మర్ బిజీ అయిపోయింది. ఊరవతల, మిగిలిన కొన్ని థియేటర్లు మినహా ఏవీ అందుబాటులో లేవు. ఈ విషయాన్ని ఛాంబర్ ధృవీకరించింది. నట్టికుమార్ మూడేళ్ళనాటి ప్రేమ పిలుస్తోంది చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
పెద్దలు చిన్న చిత్రాలకు థియేటర్ ఇవ్వడంలేదని వాపోయాడు. ఈ సందర్భంగా ఛాంబర్ ఎవరి చిత్రాలైనా సరుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనీ, లేదంటే రెండోరోజే తీసేస్తారని చెప్పింది. అయితే... ఈసారి ఆసక్తికరంగా నందమూరి వంశం నుంచి రెండు, మెగా బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో దాదాపు థియేటర్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. బాలయ్య నటించిన అధినాయకుడు చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇందులో మూడు గెటప్‌లలో ఉన్న ఆయన ట్రైలర్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ సాధించింది.
పవన్‌కళ్యాన్ 'నాకు కొంచెం తిక్క ఉందని' గబ్బర్‌సింగ్‌తో ముందుకు వస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకుడు. గణేష్ నిర్మాత. ఎన్.టి.ఆర్. దమ్ము సమ్మర్‌లో సిద్ధమైంది. ఇందులో ఎన్.టి.ఆర్. రెండు పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే రామ్‌చరణ్ నటించిన 'రచ్చ'కూడా సమ్మర్‌లో వస్తుంది. అయితే... ఈ నాలుగు సినిమాలు విడుదలైతే థియేటర్లు దొరకవు కనుక... కాస్త అటుఇటూగా చూసి రిలీజ్ చేస్తారని పలువురు ఎగ్జిబిటర్లు అంటున్నారు. వీరి మధ్యలో వచ్చే ఎటువంటి చిన్న చిత్రమైనా నిలబడడం కష్టమే కనుక... కొద్దిరోజులపాటు వారు వాయిదా వేసుకోవాలని అంటున్నారు.

Post a Comment