మొదటి నుంచి రచ్చ ఆడియో గురించి రచ్చ జరుగుతూనే ఉంది. కర్నూలులో ఆర్భాటంగా ఆడియో ఫంక్షన్ చేయాలని నిర్ణయించి చివరి నిముషంలో విద్యార్థులకు పరీక్ష సీజన్ కనుక అక్కడ పోలీసు యంత్రాంగం సరైన రక్షణ కల్పించ లేదని చిరంజీవి అసెంబ్లీలో విలేకరులతో చెప్పారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్‌లో ఫంక్షన్‌ను భారీగా ఏర్పాటు చేశారు.
ఆదివారంనాడు ఫంక్షన్. కాగా, రచ్చ షూటింగ్‌లోని ఓ సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. శనివారంనాడు వైవిధ్యమైన రామ్ చరణ్ స్టెప్స్‌తో షూటింగ్ జరుగుతుంది. ప్రేమ్ రక్షిత డాన్స్ డైరెక్టర్.. ఓ భంగిమలో రామ్ చరణ్ కాలు బెణికింది. నడవలేని స్థితి.
కనీసం ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. ఆల్‌రెడీ రేపు ఆడియో పెట్టుకున్నాడు. అక్కడ పాటలోనైనా ఫ్యాన్స్ అడిగితే స్టెప్స్ వేయాలి. అదీ కాకుండా ఈ నెల 29న సినిమాను విడుదలకు ప్లాన్ చేశారు. మరి ఈ రచ్చ ఆడియో ఫంక్షన్ ఎంత ఆర్భాటంగా జరుగుతుందో చూడాలి.

Post a Comment