చిత్రం రైట్స్ కోసం డైరక్ట్ గా నిర్మాతని సంప్రదించి బేరం మాట్లాడుకోవటం పరిపాటి. తమ చిత్రానికి ఉన్న క్రేజ్ ని బట్టి వారు ఓ రేటు చెప్పంట,బేరం ఆడుకుని కొనుగోలు చేస్తూండటం పరిపాటి. అయితే తాజాగా ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయనుంది ధనుష్ చిత్రం. తన భార్య ఐశ్వర్య దర్సకత్వంలో రూపొందిన 3 చిత్రాన్ని వేలం పద్ధతిలో విక్రయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ధనుష్ భార్య రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ధనుష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
నూతన సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రంలోని ధనుష్ రాసి, పాడిన వైదిస్ కొలెవైరిడి పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాటకు లభించిన ప్రచారం, ధనుష్, ఐశ్వర్యలకు ప్రధాని నుంచి లభించిన గౌరవం 3 చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఈ చిత్రంపై ఇటు చిత్ర పరిశ్రమలోను అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ హక్కులు 50 కోట్లకు పొందడానికి ఒక ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. అయితే చిత్ర నిర్మాత ధనుష్ తండ్రి కస్తూరిరాజా 3 చిత్ర వ్యాపారాన్ని వేలం పద్ధతిలో చేయాలని నిర్ణయించారు.
ఇంతకుముందు ధనుష్ నటించిన తిరుడా తిరుడి చిత్ర ఎన్‌ఎస్‌సీ (ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు, చెంగల్‌పట్టు ) ఏరియాలో వ్యాపారాన్ని వేలం పద్ధతిలోనే విక్రయించారన్నది గమనార్హం. 3 చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విధానం కనుక క్లిక్ అయితే ఇక నుంచి క్రేజ్ ఉన్న సినిమాలన్నీ ఇలా వేలంలో అమ్మే పద్దతి వస్తుందని తమిళ పత్రికలు అంచనాలు వేస్తున్నాయి.

Post a Comment