బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తెలుగులో నటింపచేయాలని చాలా కాలంగా ఇక్కడ నిర్మాతలు ట్రై చేస్తున్నారు. అయితే ఆమె ఆసక్తి చూపకపోవటంతో ఎంత రెమ్యునేషన్ ఆఫర్ చేసినా ఎప్పుడూ ఇక్కడ చేయలేదు. అయితే ఆమె తెలుగులో చేయటానికి తను ఆసక్తి ఉందని ఈ రోజు(గురువారం)ప్రకటించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో క్రిష్ 3 చిత్రం షూటింగ్ కోసం వచ్చిన ఆమెను కలిసిన మీడియాతో ఆమె ఇలా స్పందించింది. అయితే తనకు తనకు తగ్గ పాత్ర లభించాలని చెప్పింది.
అలాగే తను ఈ సంవత్సరంలో చేసిన అగ్నిఫధ్ చిత్రం సూపర్ హిట్ కావటం తనకు ఆనందాన్ని కలగచేస్తోందని చెప్పింది. ఇప్పటికే కత్రినాకైఫ్ వంటి బాలీవుడ్ భామలు ఇక్కడ తెరంగ్రేటం చేసారు. అలాగే ఇలియానా వంటి వారు అక్కడ ప్రియాంక చోప్రాతో కలిసి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి స్టార్ హీరోయిన్స్ కు కూడా తెలుగు సిని పరిశ్రమపై ఆసక్తి కలుగుతోంది. మరి ఏ హీరో ప్రక్కన ఆమెను తీసుకుంటారో,ఏ దర్శకుడు ఆమెకు అవకాశం కల్పిస్తాడో వేచి చూడాలి.

Post a Comment