ఒక మార్పు.. మరో మార్పుకు శ్రీకారం చుడుతుంది. ఎవరో ఏదో చేశారనేకంటే మనకు మనం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ప్రతి ఒక్కరిలో మార్పు తెస్తుంది. అది సినిమారంగంపై ప్రస్తుతం బాగా ప్రభావం చూపుతోంది. రాజకీయ వారసుల్లా ముద్రపడే నాయకుల మాదిరిగా కాకుండా... నటనలో వారసులమయినా... తమ కష్టమేమిటో తెలియజేయాలనే ఆలోచనలో వారు కన్పిస్తున్నారు.
ఒకప్పుడు కథానాయకులు ఆహార్యం, హావభావాలు.. ఇత్యాది అంశాలపై చాలా శ్రద్ధ పెట్టి పేజీలకు పేజీలు డైలాగ్‌లు కంఠతా పట్టేస్తుండేవారు. దాని వల్ల మెమెరీ పవర్ పెరుగుతుంది. ఇలా రోజువారీ కొంతసేపు కసరత్తు చేసేవారు. ఫైట్లు చేయాలంటే డూప్‌లు, డాన్స్‌లోనూ డూప్‌లు ఉండేవారు.
కానీ ఇప్పటి తరంలో మార్పు కన్పిస్తోంది. వారసత్వం అనే ముద్ర నుంచి బయటపడాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగమే బాడీలను మార్పు చేసేందుకు చేస్తున్న కసరత్తు. మరోవైపు డూప్లికేట్ లేకుండా స్వంతగా సాహస విన్యాసాలు చేయడం పరిపాటి అయింది. ఈ మార్పును చూసి పరిశ్రమ ఎంత మార్పు చెందిందోనని పెద్దలు చర్చించుకుంటున్నారు.
Post a Comment