.
Home » » సైబర్ నేరాలకు చెక్ పెట్టే ‘ఆపిల్ మ్యాక్’..?

సైబర్ నేరాలకు చెక్ పెట్టే ‘ఆపిల్ మ్యాక్’..?

Written By Hot nd spicy on Sunday, 5 February 2012 | 00:16

నేటి తరం కోరుకుంటన్న సురక్షిత సాంకేతికత పై దృష్టిసారించిన ఆపిల్
సైబర్ ప్రమాదాలను నివారించే ‘Mac OS X Lion 10.7.2’ ఆపరేటింగ్ సిస్టంను డిజైన్ చేసింది. ఆపిల్ పీసీలతో పాటు ల్యాప్ టాప్ పీసీ ఈ వోఎస్ ను లోడ్ చేసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటింగ్ వ్యవస్థను బెంబేలెత్తిస్తున్న హ్యాకింగ్, మాల్ వేర్ వంటి సైబర్ నేరాలను ఈ వోఎస్ సమర్ధవంతంగా ఎదుర్కొగలదు. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ మీ చెంత ఉంటే, మీ పీసీలోని డేటా సురక్షితంగా ఉన్నట్లే. రిమోట్ ఆధారిత టెక్నాలజీని ఈ వోఎస్ లో నిక్షిప్తం చేశారు.
యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్లతో రూపొందించిన ‘Mac OS X Lion 10.7.2’ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపిల్ వినియోగదారులు ఈ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ వ్యవస్థను సంబంధిత సైట్లలోకి ప్రవేశించి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger