మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 17వ తేదీన విడుదల అవుతున్న చిత్రం 'నిప్పు'. గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ, దీక్షాసేథ్ కాంబినేషన్ లో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్.చౌదరి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం మొదట్లో పెద్దగా టాక్ లేకపోయినా గత కొద్ది రోజులుగా పాజిటివ్ గా ప్రి రిలీజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫన్ తో కూడిన ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందులోనూ రవితేజ చిత్రం గ్యాప్ చాలా రావటంతో అభిమానులలోనూ మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. గుణశేఖర్ సైతం లైఫ్ అండ్ క్వచ్చిన్ అన్నట్లుగా కసిగా ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందించినట్లు చెప్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి ధమన్ అందించిన పాటలు కూడా మార్కెట్లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రంపై వైవియస్ చౌదరి సైతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ... గతంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'సొగసు చూడ తరమా' 'చూడాలనివుంది' 'ఒక్కడు' 'బాల రామాయణం' 'అర్జున్' చిత్రాలు ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో అలాగే 'నిప్పు' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. 'లాహిరి లాహిరి' చిత్రంతో 'బొమ్మరిల్లు' పతాకం ప్రారంభించి 'సీతయ్య' 'దేవదాసు', 'ఒక్క మగాడు'లాంటి హిట్ సినిమాలు నిర్మించా. ఇప్పుడు ఈ చిత్రాన్ని తీశాను. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సర్వేష్ మురారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. శ్రీధర్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి'' అన్నారు.

Post a Comment