జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ...‘బాద్ షా’ అనే మరో టైటిల్ పై కూడా దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బాద్ షా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ కథ-స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ నటించబోతోంది. నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెవి. గుహన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. జూనియర్ ఇందులో డబల్ రోల్ చేస్తున్నాడని, ఒకటి పోలీసాఫీసర్ పాత్ర, మరొకటి ఫ్యాక్షన్ లీడర్ పాత్ర అని అంటున్నారు. తండ్రి పాత్రలో జూనియర్ ఫ్యాక్షనిస్టుగా, కొడుకు పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

Post a Comment