సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా సినిమా ‘కొచ్చాడయాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే, సినిమా విడుదలకు ముందే అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటోను విడుదల అయింది. తాజాగా మరో మతి పోగొట్టే ఫోటోను విడుదల చేశారు. ఇది మార్ఫింగ్ మాయాజాలమే అయినా.....రజనీ అభిమానులకు మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
ఈచిత్రం ద్వారా రజనీ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఈ చిత్రం యొక్క డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉందని, తెలుగు ఈ చిత్రానికి ‘ఖడ్గ రుద్ర’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment