‘చంద్రముఖి’ నుండి ‘శ్రీరామరాజ్యం’ వరకూ నయనతార ఏ చిత్రంలో నటించినా ఎదురులేకుండా పోయింది. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తరువాత నయనతార పెద్ద హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె నటన, గ లామర్ ఇందుకు తోడవడంతో తాజాగా ఆమె ఎంత కోరినా ఇస్తామని వరసకడుతున్నారు నిర్మాతలు.
దీంతో ఆఫర్లు ఎక్కువై నయనతారకు ఏం చేయాలో తోచడంలేదు. ఏ హీరోకైనా సరిపోయే విధంగా ఉండడం నయనకు ప్లస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లిఊసు ఎత్తవద్దని హీరోయిన్లు లేని లోటును తీర్చమని నిర్మాతలు అడుగుతున్నారు. దానికి తగ్గట్టు ఎంత అడిగినా ఇస్తామని, దాదాపు రెండు కోట్ల స్థాయికి కూడా వెళ్ళి అడుగుతున్నారు.

పెళ్లిచేసుకొని సెటిల్ అయిపోదామనుకున్న నయనతారకు ఇదొక అగ్నిపరీక్షగా మారింది. ఇన్నాళ్లు ఆగిన ప్రభుదేవా ఇంకా ఆగమంటే ఆగుతాడా అన్న ప్రశ్న కూడా ఆమెను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో అని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
Post a Comment