.
Home » » సెల్‌ సిగ్నళ్లలో సమస్యా..??! సౌర తుఫాను ప్రభావం కావచ్చు..!!

సెల్‌ సిగ్నళ్లలో సమస్యా..??! సౌర తుఫాను ప్రభావం కావచ్చు..!!

Written By Hot nd spicy on Wednesday, 25 January 2012 | 08:10

ఈ రోజు మీరు సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఎప్పుడూ లేని రీతిలో ఫోనులో అవతలి వ్యక్తి గొంతులో కానీ, ఆ వ్యక్తికి మీ గొంతులో హెచ్చుతగ్గులు అనిపిస్తున్నాయా? విద్యుత్ సరఫరాలో విపరీతమయిన హెచ్చుతగ్గులు అనిపిస్తున్నాయా? నెట్ కూడా స్లోగా ఉందా? ఎన్నడూ లేనిదీ ఈ రోజే ఈ సమస్య ఏమిటనుకుంటున్నారా? మీ నెట్‌వర్క్ కస్టమర్ కేర్‌కో, విద్యుత్ సిబ్బందికో ఫిర్యాదు చేయడానికి ముందు ఈ విషయం తెలుసుకోండి.

సూర్యునిలో సోమవారం నాడు తీవ్రమయిన తుఫాను ఏర్పడింది. సౌర వాతావరణంలో నిక్షిప్తమయి ఉన్న అయస్కాంత శక్తి అకస్మాత్తుగా ఏర్పడటం వలన ఈ తుఫానులు ఏర్పడతాయి. ఈ తుఫానులు రోజుల తరబడే కాదు... కొన్నిసార్లు నెలలపాటు కూడా కొనసాగుతాయి.

ఆ తుఫానుల ప్రభావం సౌరమండలం లోని గ్రహాలపై కూడా ఉంటుంది. తుఫాను సందర్భంగా సూర్యునిపై ఏర్పడిన అయాస్కాంత శక్తి సౌరమండలాన్ని కప్పేస్తుంది. అలా ఏర్పడినదే ఈ సౌర తుఫాను. సోమవారం నాడు ఏర్పడిన తుఫానులో ఏర్పడిన అయస్కాంత శక్తి ప్రభావం రెండు రోజుల పాటు సౌరమండలంలో ప్రయాణించి బుధవారం నాడు భూకక్ష్యను చేరుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్(సిఎంఇ) అంటారు.

సిఎంఇ అంటే సూర్యుని నుండి వెలువడే ప్లాస్మా. ఈ ప్లాస్మాలో ఆయస్కాంత రేణువులుంటాయి. తుఫాను సందర్భంగా ఏర్పడే సీఎంఈలోని రేణువులు భూ అయాస్కాంత క్షేత్రాన్ని ఢీకొడతాయి. అలా ఢీకొట్టే సమయంలో భూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, మన అయాస్కాంత కక్ష్యలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అయితే, గతంలో ఏర్పడిన సౌర తుఫానుల కంటే ప్రస్తుత తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది. ఎంతగా అంటే సెకనుకు 2,200 కిలోమీటర్ల వేగంతో ఈ సీఎంఇ మనవైపు దూసుకొచ్చినంత.

గతంలో భూ అయస్కాంత కక్ష్యలోకి దూసుకొచ్చిన సీఎంఇ వేగానికిది నాలుగురెట్లు అధికం. దీనివల్ల భూమిపై విద్యుత్ గ్రిడ్లు, ప్రసార వ్యవస్థలతో పాటు, కక్ష్యలోని ఉపగ్రహాల పనితీరులో పెను మార్పు సంభవిస్తుంది. అయితే, ఇది తాత్కాలికమే, కేవలం కొద్ది గంటల్లోనే ముగిసిపోతుంది. భయపడాల్సిన పనేమీ లేదు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే, కొంతకాలం క్రితం ఏర్పడిన సౌరతుఫాను కెనడాపై తీవ్రమయిన ప్రభావాన్ని చూపింది. అక్కడి విద్యుత్, ప్రసార వ్యవస్థలు స్తంభించి జనజీవనం అల్లాడింది. అమెరికా కూడా ఒకప్పుడు ఈ సౌర తుఫాను బాధిత దేశమే.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger