సినిమాల్లో నటిస్తున్నంతకాలం అభిమానుల మధ్య ఎంతటి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ చిరంజీవి, బాలకృష్ణలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు దాదాపు లేవు. బాలకృష్ణ తనకు సోదరుడు లాంటి వారని చిరంజీవి అంటే... బాలయ్య కూడా చిరంజీవిని అదే రీతిన సంబోధించేవారు. అలా టాలీవుడ్‌లో చిరు - బాలయ్య కెరీర్ సాగింది.
అకస్మాత్తుగా ఇప్పుడు సీన్ మారిపోయింది. బాలకృష్ణ వచ్చే 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడమే కాక సామాజిక న్యాయం చేస్తానంటూ వచ్చిన పీఆర్పీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందంటూ చిరంజీవిపై తొలిసారిగా రాజకీయ విమర్శ చేశారు. దీనిపై చిరు స్పందిస్తూ.. బాలయ్య చిన్నపిల్లాడంటూ కొట్టి పారేశారు. అలా వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రభావం ఇపుడు టాలీవుడ్‌పై పండింది. దీంతో టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోతున్నట్లు చెపుతున్నారు.
నందమూరి కుటుంబం అంతా ఒకవైపు చిరు ఫ్యామిలీ అంతా మరోవైపు ఉండగా వీరి వెంట ఎవరికివారు వర్గాలుగా వెళ్లి చేరిపోతున్నట్లు వినికిడి. మొత్తమ్మీద "డర్టీ" పాలిటిక్స్ అని వెనుకటికి పెద్దలు చెప్పినట్లు ఈ రాజకీయాలు కారణంగానే చిరంజీవి - బాలకృష్ణలు ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వీరి మూలంగా ఇండస్ట్రీలో ఉన్న మిగిలినవారు ఏ వర్గంలోకి వెళితే ఎవరు ఎలా ఫీలవుతారో అని బెంగలో ఉంటున్నారు.

Post a Comment