హిందీలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచి కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు సృష్టించిన '3 ఇడియట్స్' ఆధారంగా విజయ్, జీవా, శ్రీరామ్ హీరోలుగా, ఇలియానా హీరోయిన్‌గా జెమిని ఫిలిం సర్క్యూట్ పతాకంపై శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'స్నేహితుడు' చిత్రం జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో విజయ్ మాట్లాడుతూ - ''తమిళ్‌లో ఈ చిత్రం 'నన్‌బన్' పేరుతో ఈ సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయింది. జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా తెలుగులో 'స్నేహితుడు'గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులో నాకు హీరోగా మంచి బ్రేక్‌నిస్తుందని నమ్ముతున్నాను. శంకర్‌లాంటి గ్రేట్ డైరెక్టర్ చేసిన ఈ చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
జెమిని ఫిలిం సర్క్యూట్‌వారు మాట్లాడుతూ - ''శంకర్, హేరిస్ జయరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'స్నేహితుడు' ఆడియో ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. తమిళ్‌లో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని జనవరి 26న తెలుగులో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ డూపర్‌హిట్ అవుతుందని ఆశిస్తున్నాము'' అన్నారు.
విజయ్, జీవా, శ్రీరామ్, ఇలియానా, సత్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మూలకథ: రాజు హిర్వాణి, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీతం: హేరిస్ జయరాజ్, ఎడిటింగ్: ఆంటోని, ఆర్ట్: ముత్తురాజ్, డాన్స్: ఫరా ఖాన్, శోభిరాజ్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, వనమాలి, సౌండ్ ఎడిటింగ్: రసూల్ పూకుట్టి, నిర్మాణం: జెమిని ఫిల్మ్ సర్క్యూట్, దర్శకత్వం: శంకర్.

Post a Comment