ఇటీవల వస్తున్న యూత్ సినిమాలపై సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సెటైర్లు విసిరారు. యూత్ సినిమాల పేరుతో పబ్‌లు, డిస్కోతెక్‌లు వంటివే ఎక్కువగా వస్తున్నాయి. లవ్ చిత్రాలంటూ రకరకాల పిచ్చి చిత్రాలూ వస్తున్నాయనీ, కుటుంబకథా చిత్రాలు వచ్చినా నేటి యూత్ చూడటంలేదని కించిత్ బాధను వ్యక్తం చేశారు.
ఇంతకీ ఆయన వ్యక్తం చేసింది... శ్రీరామరాజ్యం చిత్రాన్ని చూడ్డానికి యూత్ పెద్దగా స్పందించడం లేదనీ, శ్రీరాముడు అందరికీ ఆదర్శం. అటువంటి సినిమాలు చూడాలి. అందులో మంచిచెడులు గ్రహించాలి. యూత్ నేడు బాగా చెడిపోయింది. పైట జారితే ఎంత ఆత్రంగానో సినిమా చూడ్డానికి ఎగబడతారు. అందుకే ఇంకా చూడాలని పబ్‌లకు పోతుంటారు.
అక్కడ చిన్న వయస్సులోనే అన్నీ చూసేశాక... భవిష్యత్ అంతా దుర్లభం చేసుకుంటారు. దాంతో వారు త్వరగా నపుంసకులుగా మారిపోతారని జోస్యం చెప్పారు. ఏదైనా ముచ్చటగా ఉన్నప్పుడే దాని ఎఫెక్ట్ బాగుంటుందని సూక్తులు వెల్లడించారు. ఆయన చెప్పింది కరెక్టే అనుకోవచ్చు కదా..!!

Post a Comment