మాస్ మహరాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై భారీ చిత్రాల నిర్మాత ‘ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని జులై నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని ఈ నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా రిలీజ్‌కి ముందే సినిమాలోని అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుదన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు. సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ...‘దేవుడు చేసిన మనుషులు ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూరి జగన్నాథ్‌గారితో చేస్తున్న ఈ సినిమా నా కెరీర్‌కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన హీరో రవితేజ, దర్శకురాలు పూరి జగన్నాథ్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌కు కృతజ్ఞతలు అన్నారు.
మాస్ మహరాజ్ రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్. నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా, మానస, గాబ్రియల్ తదితరులు నటిస్తున్నారు. ఫోటో గ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ : చిన్నా, సంగీతం : రఘు కుంచె, పాటలు : భాస్కరభట్ల, ఎడిటింగ్ : ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్ : విజయ్, డాన్స్ : ప్రదీప్ ఆంథోని, దినేష్, స్టిల్స్ : సాయి మాగంటి, కో-డైరెక్టర్ : విజయరామ్ ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్ : మోహన్ రాజు ఆర్, క్యాషియర్ : జంగపల్లి మొగలి, సమర్పణ : రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : పూరి జగన్నాథ్
Share with Friends : |
Share with Friends : |
Post a Comment