.
Home » » లక్ష్యం చేరా! కానీ ఛాలెంజ్‌ మిగిలింది: రామ్ చరణ్

లక్ష్యం చేరా! కానీ ఛాలెంజ్‌ మిగిలింది: రామ్ చరణ్

Written By Hot nd spicy on Tuesday, 17 July 2012 | 11:31

సూపర్‌గుడ్‌ పిలింస్‌ రూపొందించిన 'రచ్చ' సినిమా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ చిత్ర ఫంక్షన్‌ను చేయాలా..? చేస్తే ఎక్కడ చేయాలి..? అనే డైలమాలో నిర్మాతలు ఉంటే.. చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్‌ మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

"రచ్చతో అనుకున్న లక్ష్యం చేరుకున్నానని అనిపిస్తోంది. ఆ సినిమా అభిమానులందరనీ సంతృప్తిపర్చింది. ఇకపై అభిమానుల దృష్టిలో పెట్టుకునే కథలు ఎంచుకుంటాను" అన్నారు.

"'జంజీర్‌' చిత్రం నాకు పెద్ద ఛాలెంజ్‌. నా పాత్ర రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన ఆ పాత్ర నాకు దక్కడం అదృష్టమే. విడుదలయ్యాక పోల్చి చూసుకోవాలి. ఇదో సవాల్‌గా స్వీకరించి చేస్తున్నాను" అన్నారు. తెలుగులో వినాయక్‌, వంశీ పైడిపల్లి చిత్రాల్లో చేస్తున్నట్లు చెప్పారు.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger