బికినీలు, న్యూడ్ ఫోటోలతో తరచూ బీభత్సం సృష్టిస్తున్న పూనమ్ పాండే గురించి కొత్త పరిచయం అక్కర్లేదనుకుంటా. అమ్మడు ఈ సారి సరికొత్త అంశంతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఈ హాట్ లేడీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే బృందంలో చేరబోతోందట. అన్నా టీం కూడా ఆమెను తమలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం...కిరణ్ బేడీ పూనమ్ పాండేకు ఇన్విటేషన్ పంపిందని, తమ బృందంలో కలిసి అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని కోరిందని తెలుస్తోంది. దేశంలో పూనమ్ పాండే అంటే తెలియని వారుండరు. ఆమెను అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు. పబ్లిసిటీ ఉన్న వ్యక్తులు టీంలో ఉంటే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మరింత ప్రచారం జరుగుతుందని అన్నాటీం భావిస్తోందట.
అవినీతిపై గత కొంత కాలంగా అన్నా హజారే అండ్ టీం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అవినీతి పెరిగి పోవడం వల్లనే భారత దేశం అభివృద్ధి చెందడం లేదని, ముందు దాన్ని నిర్మూలిస్తేనే దేశం ప్రగతి బాట పడుతుందని నమ్ముతున్న అన్న అండ్ టీం దేశాన్ని అవినీతి రహితంగా చేసేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని పోరాటం చేస్తున్నారు.
మరి పూనమ్ పాండే ప్రచారం అన్నా బృందానికి ఏ మేరకు ఉపకరిస్తుందో...? అసలు ఉపకరిస్తుందా..లేక విమర్శలకు దారి తీస్తుందా? వెయిట్ అండ్ సీ....

Share with Friends : |
Share with Friends : |
Post a Comment