పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ బయటకు లీకైంది. ఇందులో పవర్ స్టార్ ముఖానికి ముసుగు ధరించి కనిపిస్తున్నాడు. ఈచిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాత్ర పోషిస్తున్న పవన్ సీక్రెట్‌గా న్యూస్ కవర్ చేయడంలో బాగంగా ఈ ముసుగు ధరిస్తాడని తెలుస్తోంది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగబోతోంది. షూటింగు కోసం ఇక్కడ భారీ సెట్ వేసినట్లు సమాచారం. ఈచిత్రం పవర్ ఫుల్ సబ్జెక్టు, అంతకంటే పరవ్ ఫుల్ డైలాగ్స్ కలగలిపి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ సినిమాగా రూపొందబోతోంది.
సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్... ఈ చిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
Share with Friends : |
Share with Friends : |
Post a Comment