1962 జూన్ 7న విడుదలైన ‘గుండమ్మ కథ' యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి రీమేక్ ప్లాన్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఒరిజినల్ గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం పోషించిన పాత్రను శ్రీదేవి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాత ఈ విషయమై ఆమెను సంప్రదించాడని సమాచారం. అయితే ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరి ఆమె ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
గుండమ్మ కథ'రీమేక్ విషయమై అక్కినేని మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో నాగార్జున,బాలకృష్ణ ఆ రీమేక్ చేద్దామని ట్రై చేయటం మాత్రం నిజం. కానీ గుండమ్మ చేసే వారు దొరకక ఆగిపోయారు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాం. ఇప్పుడు వాళ్లు యాభైల్లో పడ్డారు. ఇప్పుడు చేయటం కష్టం. యంగ్ జనరేషన్ హీరోలు జూ.ఎన్టీఆర్,నాగచైతన్య ఆ రోల్స్ కి బెస్ట్ అని తేల్చి చెప్పారు.
ఇక ‘గుండమ్మ కథ' విషయానికి వస్తే...భారతదేశంలో వంద సినిమాలు పూర్తి చేసిన తొలి హీరోగా ఈ చిత్రంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆ తరువాతి స్థానం అక్కినేనిదే. ఆయనకు ఇది 99వ సినిమా. వీరిద్దరూ కలిసి నటించిన పదో సినిమా ఇది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తయారైంది. అక్కడ చక్రపాణి డెరైక్ట్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను జెమినీ గణేశన్ పోషించగా, ఏయన్నార్, సావిత్రి, జమున తమ పాత్రలు తామే చేశారు.
శ్రీదేవి మళ్లీ తెలుగు సినిమాల్లో నటించబోతోందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏదీ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇటీవల మంచు ఫ్యామిలీ తీసే ఓ చిత్రంలో మండోదరి పాత్రకు ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చినా అదంతా అవాస్తవమని మోహన్ బాబు కొట్టి పారేశారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment