కమల్ హాసన్ కుమార్తెగా శ్రుతిహాసన్ నటిగా తెలుగులోనూ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పటి వరకు తెలుగులో పెద్దగా హిట్ చిత్రమంటూ లేదు. ఈమెను కథానాయికగా తీసుకుందామనుకున్నా చాలామంది సెంటిమెంట్‌రీత్యా వెనకంజ వేస్తూ వచ్చారు. అయితే, 'గబ్బర్ సింగ్' చిత్రం హిట్‌తో ఒక్కసారిగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. సినిమా హిట్‌తో ఆమెకూ కూడా మంచి పేరే వచ్చింది. సోమవారం ఆమె చిత్ర ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించింది.
* గబ్బర్ సింగ్ చిత్ర విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
ఈరోజు చాలా స్పెషల్‌డేగా ఫీలవుతున్నా. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత అంతా నన్ను కొత్తగా చూస్తున్నారు. ఈ క్రెడిట్ పాత్ర ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌కు దక్కుతుంది.
* తొలిసారిగా పవన్‌కళ్యాణ్‌తో నటించడం ఎలాంటి అనుభూతి కలిగింది?
ప్రతి విషయంలోనూ చాలా సహకరించారు. పవన్ అంటే ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి చాలా పెద్ద హీరో కదా అనిపించింది. అలాంటివి ఏమీ ఆయనలో కన్పించలేదు. చాలా తెలివైన వ్యక్తి. మా కాంబినేషన్‌లో హిట్‌రావడం చాలా ఆనందంగా ఉంది.
* లంగా ఓణీ పాత్ర చేయాలని చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
ఇప్పటివరకు చాలా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ మొదటిసారి అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించాను. దీనికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. ఆయన అందర్నీ ఇష్టపడే గుణం గలవాడు. షూటింగ్ మొదటి నుంచి చివరివరకు అదే ఎనర్జీతో చాలా ఎంకరేజ్ చేసేవారు.
* ఈ చిత్రం హిట్‌ను ఎలా పోల్చగలరు?
నా కెరీర్‌లో హిట్, ఫ్లాప్‌లు లేవు. గబ్బర్ సింగ్ సూపర్‌హిట్. ఆర్టిస్టుగా నా పని నేను చేసుకుంటూ పోవడమే నా కర్తవ్యం.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment