యమలోకం బ్యాక్ డ్రాప్ లో అల్లరి నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఇప్పటివరకూ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యముడి ఇంటిసెట్‌లో అల్లరి నరేష్, హీరోయిన్ రిచాపనయ్, రమ్యకృష్ణలపై ఓ పాటను చిత్రీకరించారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటకు రీమిక్స్ ఇది. చంటి అడ్డాల నిర్మాత. యమలోకం నేపథ్యంలో సాగే సరదా చిత్రమిది.
దర్శకుడు ఇ.సత్తిబాబు కథ గురించి చెపుతూ...ఈ చిత్రం కథలో యమలోకం వెళ్లిన అల్లరి నరేష్ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. ఆ తర్వాత జరిగిన కథేమిటో తెరపైనే చూడాలంటున్నారు.
అలాగే ''తెలుగు తెరపైకి యముడి నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ చక్కటి విజయాన్ని సాధించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ఇది. నరేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే పాత్రను ఇందులో పోషిస్తున్నారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేసి చూపిస్తున్నాం. యముడిగా సాయాజీషిండే, ఆయన భార్యగా రమ్యకృష్ణ పాత్రలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. ''కీలక సన్నివేశాలతో పాటు, ఇటీవలే నాయకానాయికలు, రమ్యకృష్ణలపై ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఫిల్మ్‌సిటీలో భారీ సెట్లు నిర్మించాము. కాగా బుధవారం నుంచి మరో మూడు భారీ సెట్లలో షూటింగ్ చేయబోతున్నామని, ఈ నెల 16 వరకు కొనసాగుతుందని నిర్మాత చంటి అడ్డాల చెప్పారు. ‘‘యముడి నేపథ్యాన్ని ఎంచుకుని తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం. నరేష్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా''అన్నారు.
యముడిగా సాయాజీ షిండే, యముని భార్యగా రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్నారు’’ అని దర్శకుడు తెలిపారు. గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, కృష్ణభగవాన్, రఘుబాబు, సుధ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు.

Post a Comment