అమీర్‌ఖాన్ రూపొందించిన టెలివిజన్ షో ‘సత్యమేవ జయతే’ ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ ప్లస్, ప్రాంతీయ చానెల్లలో ప్రసారమైన సంగతి తెలిసిందే. ప్రసారానికి కొద్ది నెలల ముందే విపరీతమైన ఆసక్తి రేపిన ఈ షో పై అన్ని వర్గాల ప్రజలు, వీక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం మండిపడుతూ ఈ షోపై కోర్టుకు వెళ్తానంటూ లీగల్ నోటీస్ పంపారు. యూఫోరియా బ్యాండ్ కి చెందిన పాలేష్ సేన్ అనే తను స్వరపరిచిన పాటలోని కోరస్ వాడుకున్నారని ఆరోపించారు. తమ బ్యాండ్ దశాబ్ద కాలం క్రిందట స్వరపరిచిన సత్యమేవ జయితే సాంగ్ లోది వాడుకున్నారని అన్నారు. ఆ పాట తమ ఫిర్ దూమ్ అనే ఆల్బమ్ లోనిదని అన్నారు. అందునిమిత్తం ఆ ఛానెల్ కి ఈ సింగర్ లీగల్ నోటీస్ పంపారు.
ఆయన ఓ డైలీతో మాట్లాడుతూ...నేను ఈ షోకు చెందిన ట్రైలర్స్ చూసాను కానీ వీడియాలు చూడలేదు. ఆ వీడియా విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. నేను 2000 సంవత్సరంలో రీలిజ్ చేసిన ఫిర్ ధూమ్ లో సత్యమేవ జయితే అనే పాటను అనుమతి లేకుండా వాడుకున్నారని అర్దమైంది. ఈ పోగ్రాం కి వాడుతున్న కోరస్ అచ్చం మా పాటలోవే అందుకే మేము లీగల్ నోటీస్ పంపాము అని తెలియచేసారు. మరో ప్రక్క ఈ షో ప్రసారమైన కొద్ది సేపట్లోనే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు..పేస్ బుక్, ట్విట్టర్ లలో ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ట్విటర్‌లో గంట వ్యవధిలోనే 2254 ట్వీట్స్ వచ్చాయి.
ఇక ఈ పోగ్రాంపై కిరణ్ బేడి స్పందిస్తూ.. సృజనాత్మకమైన, సాక్ష్యాధారాలతో కూడిన, ఉద్వేగ భరితమైన, స్పూర్తినిచ్చే కార్యక్రమాన్ని అందించిన అమీర్ ఖాన్ ‘ఫుల్ మార్క్’ అంటూ ట్వీట్ చేశారు. టెలివిజన్‌లో ఇలాంటి కార్యక్రమాలను తాను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని.. ఇప్పుడు తన కోరిక నిజరూపం దాల్చిందని దియా మీర్జా అన్నారు. ఈ కార్యక్రమంపై ప్రీతి జింటా, ఫరాన్ అక్తర్, షబానా ఆజ్మీ, నేహా దూపియా, మందిరాబేడి, కబీర్ బేడి లు అమీర్ ఖాన్ సాహసాన్ని అభినందించారు. మే 6వ తేదిన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ‘భ్రూణ హత్య’లపై దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చక్కగా విశ్లేషించారు.
ఇక ఈ షో గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...''ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ... దేశభక్తి తప్పకుండా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తన దేశం గురించి ఆలోచిస్తారు. నేను కూడా అంతే. నా చుట్టూ ఉన్న సమాజం, సాధకబాధకాలు చూస్తూనే ఉంటాను. వాటిపై పోరాడడానికి నేనేమీ సామాజికవేత్తను కాను. పరిష్కామార్గం సూచించడానికి మేధావినీ కాను. కానీ... ఓ సమస్యను విని అర్థం చేసుకొనే మనసు ఉంది. అది చాలు'' అని చెబుతున్నారు. ఆయన తొలిసారి బుల్లి తెరపైకి 'సత్యమేవ జయతే' కార్యక్రమంతో వచ్చారు. అమీర్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమానికి ఆయనే నిర్మాత.
అలాగే ''నా సినీ ప్రయాణంలో తక్కువ చిత్రాలే చేశాను. అందుకే అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం రాలేదు. ఈ కార్యక్రమం ద్వారా భిన్నమైన వ్యక్తుల్ని, మనస్తత్వాల్నీ అర్థం చేసుకొనే వీలు చిక్కింది. పిల్లలు, పెద్దవాళ్లూ, మహిళలూ... అందరూ అతిథులే. వారి జీవితాల్లోని కోణాల్ని స్పృశించే వీలు చిక్కింది. చాలా సందర్భాల్లో భావోద్వేగాలు ఆపుకోలేకపోయాను. ఈ షోలో నేను మనస్ఫూర్తిగా నవ్వాను, చాలా సందర్భాల్లో ఏడ్చాను. కన్నీళ్లొస్తున్నప్పుడు ఎందుకు ఆపుకోవాలి? టీవీ చాలా బలమైన మీడియా. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొన్నానో లేదో తెలీదుగానీ నేను చెప్పదలచుకొన్న విషయాన్ని మాత్రం సూటిగానే చెప్పాను. ఓ నిజాన్ని గెలిపించడానికి నిజాయతీతో చేస్తున్న ప్రయత్నమిది. టీఆర్‌పీ రేటింగ్స్ గురించి నాకు ఎలాంటి బెంగా లేదు. దాన్ని పెంచుకోవడానికి ఎలాంటి జిమ్మిక్కులూ చేయడం లేదు. నా భావనలు ప్రేక్షకులకు అర్థమైతే చాలు..'' అంటూ చెప్పుకొచ్చారాయన.

Post a Comment