సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక అంటే...ఆ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసేలా విజయం సాధించడం ఖాయం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో కొత్తగా చెప్పక్కర్లేదు.
తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. ఇటీవల ఇందుకు సంబంధించి మహేష్, పూరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. పూరిపై పూర్తి నమ్మకంతో మహేష్ బాబు కళ్లు మూసుకుని ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. మరో విషయం ఏమిటంటే...ఈచిత్రాన్ని నిర్మించే అవకాశం ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
బండ్ల గణేష్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆవెంటనే మహేష్ బాబు సినిమా చేసే అవకాశం అతనికి దక్కడంపై పరిశ్రమలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హీరోకి, దర్శకుడికి గణేష్ భారీ అమౌంట్ ఆఫర్ చేసి ఈ అవకాశం దక్కించుకున్నాడని అంటున్నారు. వీరి కాంబినేషన్ సినిమా అంటే తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అంచనాలు తలక్రిందులైనా పెట్టిన పెట్టుబడి గ్యారంటీగా తిరిగి వస్తుందనే నమ్మకంతో వారికి భారీగా ఆఫర్ చేసినట్లు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో పాటు, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈచిత్రం అనంతరం బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. పూరి జగన్నాథ్ రవితేజ హీరోగా ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మహేష్-పూరి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment