.
Home » » 'గబ్బర్ సింగ్' అమెరికా, తమిళనాడు కలెక్షన్స్

'గబ్బర్ సింగ్' అమెరికా, తమిళనాడు కలెక్షన్స్

Written By Hot nd spicy on Monday, 14 May 2012 | 09:46

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “గబ్బర్ సింగ్” ఆంధ్రాలో విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ సునామీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా ఏరియాలో కూడా ఇదే విధమైన హవా కనపడుతోంది. అమెరికా,తమిళనాడు,కర్ణాటకలో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ ట్రేడ్ నిపుణులుని షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్..బాలీవుడ్ చిత్రాలకన్నా ఎక్కువ వసూలు చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించాడు.

తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో....గబ్బర్ సింగ్ సినిమా ఈ వీకెండ్ మొత్తం కలిసి $577,090 రాబట్టిందని చెప్పారు. బాలీవుడ్ చిత్రాల థియేటర్లతో పోలీస్తే మూడో వంతు థియేటర్లో విడుదలైన ఈ చిత్రం వాటి కన్నా ఎక్కువ రాబట్టింది అన్నారు. అలాగే ఈ చిత్రం కలెక్షన్స్ జోరు మరికొంత కాలం కొనసాగుతుందని.. మరింత ఎక్కువగా అమెరికాలో బిజినెస్ చేస్తుందని అన్నారు. ఫ్యాన్స్ కి నచ్చిన ఈ చిత్రం అమెరికాలో ఒక్కొక్కరూ ఒకటికి నాలుగు సార్లు చూస్తున్నారని అక్కడున్న మనవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇక తమిళనాడు బిజినెస్ విషయానికి వస్తే...తమిళ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్ళై తన ట్విట్ లో ఈ చిత్రం కలెక్షన్ గురించి రాసుకొచ్చారు. ఆయన మాటల్లో...తమిళనాడులో ఇరవై ఐదు స్క్రీన్స్ తో విడుదలైన ఈ చిత్రం ఎక్కడా డ్రాప్ కాలేదు. చెన్నైలో కూడా అద్బుతమైన ఓపినింగ్స్ వచ్చాయి. స్ట్రైయిట్ తమిళ సినిమా మాదిరి ఈ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకూ రిలీజైన చిత్రాల్లో ఈ రేంజి ఓపినింగ్స్ ఈ చిత్రానికే వచ్చాయి. చాలా మల్టిప్లెక్స్ లు రెండో రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పూర్తిగా గబ్బర్ సింగ్ నే ప్రదర్శిస్తున్నాయి. తమిళేతర చిత్రానికి ఈ ఆదరణ రావటం అపూర్వం అని ప్రశంశించారు.

గబ్బర్ సింగ్ కలెక్షన్స్ ఆంద్రాలో ఈ వీకెండ్ మూడు రోజులు దుమ్ము దులిపాయి. చాలా చోట్ల మల్టిప్లెక్స్ లలో మిగతా సినిమాలు తీసేసి..కేవలం గబ్బర్ సింగ్ నే ప్రదర్శించారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడ్డాయి. మూడో రోజు కూడా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మటం ఈ సినిమా విజయం రేంజి ని తెలుపుతోందని చెప్తున్నారు. సినిమాకు ప్లస్ అయిన ఎంటర్టన్మెంట్ గురించి అంతటా హాట్ టాపిక్ గా నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కి వచ్చి ఈ హిట్ అని అభిమానులంతా పండుగ చేసుకుంటున్నారు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger