‘‘వెంకటేష్, మహేష్‌లు మాత్రమే కాదు. వీరిద్దరినీ మించిన మరో హీరో ఉన్నాడు మా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో. ఆ హీరో ఎవరో కాదు... కథ. పూర్తిగా కథపై ఆధారపడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కథానుగుణంగానే హీరోలను కూడా ఎంచుకున్నాం. అదృష్టవశాత్తు వెంకటేష్, మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాకు దొరికారు అంటున్నారు అడ్డాల శ్రీకాంత్. కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్రీకాంత్ తన తదుపరి చిత్రంగా ఈ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాలను మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ...మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలు కూడా మల్టీస్టారర్లే. కథానుగుణంగా వాటికి టైటిల్స్ పెట్టారు. అందుకే అవి క్లాసిక్స్ అయ్యాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే... సమాజానికి మంచి చేసినట్టే లెక్క అని తెలిపే గొప్ప కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు అన్నారు.
సమంత, అంజలి హీరోయిన్స్ గా చేస్తున్న తమ చిత్రంలో వారి పాత్రలు కూడా కథకు కీలకమైనవేనని చెప్పారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ప్రస్తుతం 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించాం అని చెప్పుకొచ్చారు. ఈ నెల 9న రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లోనే ప్రకాష్‌రాజ్ పాత్ర ప్రవేశిస్తుంది. మహేష్, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. హైదరాబాద్‌లోనే ఈ షెడ్యూల్ జరుగుతుంది’’ అని తెలిపారు దర్శకుడు. జయసుధ, రోహిణీ హట్టంగడి, శ్వేతాప్రసాద్, రవిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: కె.వి.గుహన్. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

Post a Comment