దక్షిణాది సినిమాల్లో హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ సెక్సీ లేగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ లక్ష్మి రాయ్ బాలీవుడ్ ఆఫర్లకు నో చెబుతోంది. ఎందుకని అడిగితే తనకు హిందీ సినిమాలపై అంతగా ఇంట్రెస్టు లేదని అంటోంది. ఇటీవల అంకుష్ భట్ దర్శకత్వం వహించబోయే ఓ చిత్రంలో ఆఫర్ రాగా నిర్మొహమాటంగా తిరస్కరిచిందట.
ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ....నేను హిందీ చిత్రానికి సైన్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. తనను సంప్రదించిన మాట వాస్తవమే కానీ...నేను ఒప్పుకోలేదు, బాలీవుడ్ సినిమాలపై నాకు ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. లక్ష్మిరాయ్ మాటలను బట్టి చూస్తే ఇప్పుడిప్పుడే దక్షిణాదిన నిలదొక్కుకుంటున్న తరుణంలో బాలీవుడ్‌లో అడుగు పెడితే ఇక్కడ అవకాశాలు తగ్గిపోతాయని, అక్కడ నిలదొక్కుకుంటామో, లేదో తెలియదు కాబట్టి దక్షిణాదినే ఉండి మరింత పుంజుకోవాలని భావిస్తోంది.
ప్రస్తుతం లక్ష్మిరాయ్ కన్నడలో కాంచన రీమేక్ సినిమాలో నటిస్తోంది. మరో వైపు ఆమె బాలకృష్ణతో కలిసి నటించిన ‘అధినాయకుడు’ చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రంపై లక్ష్మిరాయ్ చాలా ఆశలు పెట్టుకుంది. బాలయ్య లాంటి పెద్ద హీరో కాబట్టి ఈ సినిమా హిట్టయితే తనకు అవకాశాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉంది.
‘కాంచనమాల కేబుల్ టివి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన లక్ష్మిరాయ్ ఆ తర్వాత ‘నీకు నాకు’ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఫెయిల్ కావడంతో ఆమెకు తెలుగు అవకాశాలు దూరం అయ్యాయి. మరికొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేక పోయింది. చివరకు కాంచన చిత్రం హిట్ కావడంతో బాలయ్య లాంటి బడా హీరోల కళ్లు ఆమె అందాలపై పడ్డాయి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment